Breaking News

అతిక్రమిస్తే చర్యలు తప్పవు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లోని ఎల్ల‌మ్మగుట్టలోగల‌ మెడికవర్‌ ఆసుపత్రి, సరస్వతి నగర్‌లోని ఇందూరు సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రిలో కోవిడ్‌ చికిత్సకు ప్రభుత్వ అనుమతి ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లాలో అనుమతి పొందిన కోవిడ్‌ చికిత్స ఆసుపత్రి వారు తప్పకుండా జివో ఆర్‌టి నెంబర్‌ 248 తేది. 15.06.2020 ప్రకారం నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాల‌ని పేర్కొన్నారు. ధరల‌ను రోగుల‌కు మరియు వారితో వచ్చిన వారికి కనిపించేలా ప్రదర్శించాల‌ని సూచించారు. కోవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే తగిన చర్యలు తీసుకోబడతాయన్నారు.

Check Also

పెండింగ్‌ ఈ-చలాన్ ల‌‌‌ను చెల్లించండి

నిజామాబాద్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ వాహానాదారుల‌కు పోలీసు ఈ-చలానా ద్వారా విధించిన జరిమానాలు ...

Comment on the article