Breaking News

ఎంతమంది క్లాసులు వింటున్నారు?

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి మండలం, పడకల్‌, కలిగొట్‌, చింత‌లూరు, జక్రాన్‌పల్లి గ్రామాల‌లో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి గురువారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల‌లో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, హరితహారం, డంపింగ్‌ యార్డ్‌ పనుల‌ను పరిశీలించారు. సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు రైతు వేదికలు రూఫ్‌ లెవెల్‌ వరకు సెప్టెంబర్‌ 30 వరకు పూర్తి చేయాల‌ని కలెక్టర్‌ అధికారుల‌ను ఆదేశించారు.

హరితహారంలో భాగంగా గ్రామాల‌లో పెద్ద మొక్కలు నాటడం వన గ్రామ రూపురేఖలు మారతాయన్నారు. కొబ్బరి, అశోక చెట్లను 50 నుండి 100 వరకు గ్రామంలో నాటాల‌ని పెద్ద మొక్కల‌ను బయట నర్సరీ నుండి కొనుగోలు చేయాల‌ని, మెయింటెనెన్స్‌ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నుండి వస్తుందన్నారు. జక్రాన్‌పల్లిలో ప్రైమరీ స్కూల్‌ సందర్శించి ఎంతమంది విద్యార్థులు క్లాసులు వింటున్నారని వాకబు చేశారు. ప్రతి విద్యార్థి క్లాస్‌ వినే విధంగా చూడాల‌ని, విద్యార్థులు క్లాసు వింటున్నారా లేదా చెక్‌ చేయాల‌న్నారు. స్కూల్‌ ఆవరణలో ఉన్న విలేజ్‌ పార్క్‌ సందర్శించారు.

స్కూల్‌ నీటుగా, గ్రామం శుభ్రంగా ఉండే విధంగా పనులు చేయించాల‌ని ఆదేశించారు. పడకల్‌ నుండి కలిగోట్‌ వెళ్లే రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటే పని వారంలో పూర్తి చేసి ఫొటోలు పంపాల‌ని పంచాయతీ సెక్రెటరీని, ఎంపీడీవోను ఆదేశించారు. చింత‌లూరు రైతు వేదిక పని వేగవంతం చేయాల‌ని వైకుంఠ ధామం ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. చింత‌లూరు ప్రైమరీ స్కూల్‌ సందర్శించిన కలెక్టర్‌ మన స్కూులు మనం ఉపయోగించుకునట్లయితే ప్రైవేటు స్కూులు అవసరం లేదని, సర్పంచ్‌ మంచి కాన్సెప్ట్‌తో ముందుకు వెళుతున్నారని, ప్రతి పిల్ల‌వాడు స్కూల్‌కు వచ్చేలా చూడాల‌ని, మంచి పనులు చేసే క్రమంలో అనేక అడ్డంకులు వస్తాయన్నారు.

పల్లె ప్రకృతి వనంలో పూల‌ మొక్కలు లేనిచోట పెద్ద మొక్కలు పెట్టాల‌ని తెలిపారు. డంపింగ్‌ యార్డుల్లో గ్రామంలో ఉత్పత్తి అయిన చెత్తను మళ్లీ దాన్ని ఉపయోగపడే విధంగా రీసైకిల్‌ చేయాల‌ని, గ్రామంలోని డ్రెయిన్లు వర్షపు నీటికి మాత్రమే ఉపయోగపడాల‌ని, ఏ ఇంటి నుండి వాటర్‌ డ్రైన్లకు రాకుండా 100 శాతం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాల‌ని, చిన్న మొక్కలు పెట్టి పెంచడం కష్టమని, అవే మొక్కలు నర్సరీలో పెట్టి పెంచి గ్రామాల‌లో పెట్టాల‌ని తెలిపారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో భారతి, తహసీల్దార్‌ రాజు, ఏఈ అర్‌పి అహ్మద్‌ హుస్సేన్‌, సర్పంచు చేతన్‌, సుకన్య, ఎంపిటిసి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

పెండింగ్‌ ఈ-చలాన్ ల‌‌‌ను చెల్లించండి

నిజామాబాద్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ వాహానాదారుల‌కు పోలీసు ఈ-చలానా ద్వారా విధించిన జరిమానాలు ...

Comment on the article