Breaking News

ఫోటో ఆల్బ‌మ్‌ సమర్పించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 9 లోగా రైతు వేదికలు పూర్తి చేసుకోవాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ శరత్‌ పంచాయితీరాజ్‌ ఇంజనీర్లను ఆదేశించారు. గురువారం జనహితలో రైతు వేదికలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాల‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల‌ 9 లోగా రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేసి ఫోటో ఆల్బ‌మ్‌ సమర్పించాల‌ని ఆదేశించారు. రైతు వేదిక భవనాల‌ చట్టూ పెద్ద మొక్కలు పచ్చదనం పెంపొందించాల‌ని, విద్యుత్‌, తాగునీటి నల్లాలు తదితర వసతులు పూర్తి చేసుకోవాల‌ని సూచించారు.

బిచ్కుంద మండలం సీతారాంపల్లి గ్రామం రైతు వేదికల‌ నిర్మాణంలో అల‌సత్వం పట్ల గ్రామ సర్పంచ్‌ ఫోన్‌ ద్వారా పనుల‌లో వేగం పెంచాల‌ని, అనుకున్న సమయంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గంలో చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణాల‌ ప్రగతిని సమీక్షించారు. మిషన్‌ భగీరథ హెల్త్‌ ట్యాంకు కనెక్షన్లు, తాగునీటి పైప్‌ లైన్‌ కనెక్షన్‌ పనులు వేగంగా పూర్తి చేయాల‌ని మిషన్‌ భగీరథ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరును ఆదేశించారు.

జనహితలో తనను కలిసిన సదాశివనగర్‌ మండలం కుప్రియాల్‌ గ్రామం వృద్ధురాలు కడమంచి గంగవ్వకు డబుల్‌ బెడ్‌ రూమ్ ఇల్లు అంత్యోదయ కార్డు మంజూరీకి చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మండల‌ అభివృద్ధి అధికారులు సమన్వయంతో పంచాయితీ రాజ్‌ రోడ్లకు ఇరువైపులా ముళ్ల పొదల తొల‌గింపు, రోడ్లకిరువైపులా మొక్కల పెంపకం ల‌క్ష్యాల‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. సమీక్ష కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టరు వెంకటేష్‌ ధోత్రే, కామారెడ్డి ఆర్‌డిఓ నరేందర్‌, పంచాయితీరాజ్‌ సిద్దిరాములు, మిషన్‌ భగీరథ ల‌క్ష్మినారాయణ, ఇంజనీర్లు పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article