నిజామాబాద్, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిషన్ భగీరథ, క్రిమటోరియం, తడి పొడి చెత్త సేకరణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సులో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి. శుక్రవారం ఎంఆర్వోలు, ఎండిఓలు, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, ఎంపీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
ప్రతి గ్రామంలో నాలుగు రకాల పనులు తీసుకోవడమైనదని, గ్రామానికి సాంక్షన్ అయిన పైప్ లైన్, టాప్‌లు పాత వాటర్ ట్యాంక్‌లు, సిసి రోడ్లు లీకేజీలకు సంబంధించిన రిపైర్లు వెంటనే చేయాలని, పూర్తికాని నల్లాల కనెక్షన్లు తొందరగా 100 శాతం పూర్తి చేయాలని, నల్లా దగ్గర సిమెంట్ దిమ్మలు తప్పకుండా ఉండాలని, వాటి దెగ్గర మొక్కలు పెట్టాలని, జిపిలో పైప్ లైన్ రిపేర్ చేసినప్పుడు రోడ్స్ చెడిపోతే వెంటనే చేయించాలని, ఒక్కసారి గ్రామంలో పని చేస్తే మళ్ళీ వెళ్లకుండా చూడాలని, పనులు పూర్తి అయిన తరువాత కమిటీకి అప్ప చెప్పాలని, ఎవ్వరైనా చెడగొడుతే వారికి 5 వేల జరిమానా విధించాలన్నారు.
గ్రామంలో జరుగుతున్న ప్రతి పనిని ఆడిట్ చేస్తారని, గ్రామంలో టాప్ నుండి ఒక్క చుక్క వృధా కావద్దని, కొన్నిచోట్ల మిషన్ భగీరథ వాటర్ రావడం లేదని, ప్రతి గ్రామంలో జనాభా లెక్కల ప్రకారం ప్రతి ఒక్కరికి 100 లీటర్ల మిషన్ భగీరథ నీరు ఇవ్వాలని, నీరు రాని దగ్గర బోర్ వాడాలని, మిషన్ భగీరథ ద్వారా నీరు వచ్చినా రాకున్నా పవర్ బిల్ జిపి నుండీ కట్టాలని, ఎంపీవోలు, మిషన్ భగీరథ ఏఈలు ఇద్దరు కో ఆర్డినేషన్ చేసుకొని పని చేయాలన్నారు.
ప్రతి గ్రామంలో ట్యాంక్‌ను నెలకు 3 సార్లు కడగాలని, తప్పకుండా ప్రతి ట్యాంక్‌ను క్లోరినేషన్ చేయాలని, రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, సాంక్షన్ అయిన పనులు పూర్తి కావాలన్నారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నదని, ప్రతి గ్రామం ఒక్క మోడల్ జిపిగా ఉండాలని, ప్రతి జిపిలో టాక్స్ు వంద శాతం వసూలు కావాలని, గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలని, ముందుగా తడి పొడి చెత్తను ప్రతి ఇంట్లో నుండి వేరుచేసి ఇచ్చేలా చూడాలని, 10, 15 ఇండ్లకు ఒక్క మనిషిని అలాట్ చేయాలని, వారు ప్రతి రోజు మోనిటర్ చేయాలని, ఇవ్వని వారికి మూడు రోజుల ట్రైనింగ్ ఇవ్వాలని, అప్పటికి ఇవ్వనట్లయితే వారికి నోటీస్ ఇవ్వాలని, కంపోస్ట్ షెడ్ పూర్తి అయితే మంచి ఎరువు వస్తుందని, ప్రతి షెడ్‌కు మంచి ఆదాయం వస్తుందని, ప్రతి గ్రామంలో చాటింపు వేయాలని, మహిళలతో ప్రతి గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారికి అవగాహన కల్పించాలని, రెండు బుట్టలో చెత్తను వేరువేరుగా వేయాలని వారికి చెప్పాలని, అదేవిధంగా పల్లె ప్రగతి, రైతు వేదికలు, విల్లేజి పార్కులు అన్ని పూర్తి కావాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లత, మిషన్ భగీరథ ఎస్ఈ రాజేందర్ కుమార్, డిపిఓ జయసుధ, జడ్పీ సీఈఓ గోవింద నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021