Breaking News

అందరం వారికి సహకరించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజి మంత్రి పి.సుదర్శన్‌ రెడ్డి సహాయ సహకారాల‌తో నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అద్యక్షుడు మానాల‌ మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల‌ మేరకు నిజామాబాద్‌ మహిళ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు సిబ్బందికి ఎన్‌ఎస్‌యుఐ అద్యక్షుడు వేణురాజ్‌ చేతుల‌ మీదుగా శానిటైజర్‌, మాస్కులు పోలీసు బృందానికి అందజేశారు.

ఈ సందర్భంగా వేణురాజ్‌ మాట్లాడుతూ కరోన సమయంలో పోలీసులు చేసే సేవ‌లు మరువలేనివని ప్రజల‌ కోసం నిత్యం కష్టపడుతున్న పోలీసుశాఖకు హాండ్‌ సానిటైజర్స్‌, మాస్కులు అందించిన మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డికి, జిల్లా కాంగ్రెస్‌ అద్యక్షుడు మానాల‌ మోహన్‌ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే అందరం కలిసి కట్టుగా కరోన కట్టడికి కృషి చేయాల‌ని ప్రజలు కూడా పోలీసుల‌కు, వైద్యుల‌కు, పారిశుద్ధ్య కార్మికుల‌కు సహకరించాల‌ని కోరారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నిజామాబాద్‌ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ వరుణ్‌, జనరల్‌ సెక్రెటరీ వేధమిత్ర, చింటూ, సూర్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

21 నుండి డిగ్రీ, పిజి తరగతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, ...

Comment on the article