చాలా వరకు టెంపరరే

బోధన్‌, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐఎఫ్‌టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు కరోనా కారణంగా సంక్షోభంలో కార్మిక కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని, యాజమానుల‌కు అనుకూలంగా కార్మిక చట్టాల‌ను‌ మార్చోద్దని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్‌ రంగానికి అప్పగించొద్దని, ఎన్‌.ఎం.ఆర్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల‌ను పర్మినెంట్‌ చేయాలంటూ తదితర డిమాండ్లతో బోధన్‌ ఆర్డీవో కార్యాల‌యం ముందు ధర్నా చేసి, ఆర్డీవో రాజేశ్వర్‌కి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి.మల్లేష్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి వల‌న దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనదని, 14 కోట్ల మంది వల‌స జీవుల‌కు కన్నీళ్లను మిగిల్చిందన్నారు. నిర్మాణ రంగం పనులు నిలిచిపోయాయని, మోటారు రంగం కుదేల‌యిందని, ప్రైవేట్‌ విద్యా సంస్థల‌లో పని చేస్తున్న వారందరికి ఉపాది కరువైందని ఇంకా అనేక పరిశ్రమలు మూత పడి ఎంతో మంది అసంఘటిత కార్మికులు రోడ్డున పడ్డారన్నారు.

అసంఘటితరంగ కార్మికులు, ఉపాది కోల్పోయిన వారందరికి 6 నెల‌లు నెల‌కు 10 ‌వేల‌ రూపాయల‌ చొప్పున చెల్లించాల‌ని, ప్రభుత్వ సంస్థల‌ను ప్రైవేట్‌ వారికి అప్పజెప్పి, నిర్వీర్యం చేయొద్దని డిమాండ్‌ చేశారు. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ రెగ్యుల‌ర్‌ ఉద్యోగాల‌ మాటే మర్చి పోయిందని, తెలంగాణ రాష్ట్రం వస్తే, కాంట్రాక్ట్‌ జాబ్స్‌ మాటే వుండదన్న కేసీఆర్‌ ఇప్పుడు వారి పాల‌నలో ల‌క్షల‌ కొద్ది అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఎంప్లాయీసేనని ప్రభుత్వ డిపార్టుమెంట్లలో 2 ల‌క్షల‌ 10 వేల‌ మంది టెంపరరేనని అన్నారు.

కొత్త నియామకాల్లో చాలా వరకు టెంపరరే నని, అరకొర సాల‌రీలు, ఎప్పుడు ఊడుతుందో తెలియని దుస్థితి అన్నారు. ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాల‌ను విడనాడల‌ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టియు నాయకులు కే రవి, వైద్యనాత్‌, ఏఐకేఏంఎస్‌ జిల్లా నాయకులు పి.శంకర్‌, ఎల్‌.గంగాధర్‌ కార్మికులు పాల్గొన్నారు.

Check Also

నేరాల‌ శాతం తగ్గించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం హైదరాబాద్‌ నుండి తెలంగాణ రాష్ట డి.జి.పి ఎమ్‌. ...

Comment on the article