నిజామాబాద్, సెప్టెంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఏఐటియుసి బీడీ కార్మిక సంఘం మరియు తెలంగాణ బీడీ కమిషనర్ల సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బీడీ మాన్యుఫ్యాక్చరర్స్ హ్యాండ్ టోబాకో మర్చంట్ అసోసియేషన్ వారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీడీ యూనియన్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ బీడీ రోలర్స్ గత ఒప్పందం 31.5.2020 నాటికి ముగిసిందని, బీడీ కమిషన్ దారుల గత వేతన ఒప్పందం 2020 మార్చి 31తో ముగిసిందని వీరిరువురి ఒప్పందం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుత కరోనా సందర్భంలో లాక్డౌన్ కాలానికి సంబంధించిన పూర్తి వేతనాలను కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు ప్రస్తుతం ఇస్తున్న రేటు 50 శాతం పెంచాలని, బట్టీ కార్మికులకు ప్రస్తుత వేతనంపై 70 శాతం పెంచాలని, నాన్ పిఎఫ్ లేకుండా అందరికీ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, బీడీలకు సరిపడా ఆకు తంబాకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ దారులకు వెయ్యి బీడీలకు అదనంగా పది రూపాయలు పెంచాలని నెలకు 26 రోజుల పని ఇవ్వాలని, వెయ్యి బీడీలకు 100 గ్రాముల ఆకు తగ్గకుండా మార్జిన్ ఇవ్వాలని, డిపాజిట్ డబ్బు పూర్తిగా జాయింట్ అకౌంట్ పేర డిపాజిట్ చేయాలన్నారు.
లేబర్ లైసెన్స్ ఫీజు యాజమాన్యమే భరించాలని, గుర్తింపు కార్డు లేని కమిషన్ దారుల గుర్తింపు కార్డు ఇవ్వాలని, కమిషనర్ ందరికీ పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. సంవత్సరానికి ఒకసారి కమిషన్ రేటు పెంచాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం వెంటనే యూనియన్ నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరపాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేనియెడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు సుతారి రాము ఎండి ముకరమ్, గోవర్ధన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021