Breaking News

నెంబర్‌ వన్‌ మార్కెట్‌ కమిటీగా రూపుదిద్దాలి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండల వ్యవసాయ మార్కెట్‌ కమిటీని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ బ్యాంక్‌ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. నూతన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గ ఎన్నుకోబడిన పాత బాల‌కృష్ణను అభినందించి ఆశీర్వదించారు. మార్కెట్‌ కమిటీలోని ధాన్యం నిలువ‌ గోదాముల‌ను పరిశీలించారు.

కొత్తగా ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను మార్కెట్‌ కమిటీ నిర్వహించనుండగా రైతుల‌కు ఎటువంటి ఇబ్బంది కల‌గకుండా కొనుగోలు కేంద్రాల‌ను నిర్వహించేలా చూడాల‌ని రైతుల‌కు అన్నివిధాలుగా సహాయసహకారాలు అందించాల‌ని సూచించారు. జిల్లాలోనే నెంబర్‌ వన్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీగ రూపుదిద్దాల‌ని తెలిపారు. కార్యక్రమంలో మండల‌ నాయకులు దొడ్ల వెంకటరామ్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ ఎజాజ్‌ పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలి

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మొస్రా మండల‌ కేంద్రంలో మండల‌ ప్రజాపరిషత్‌ సర్వసభ్య ...

Comment on the article