Breaking News

చట్టవ్యతిరేక కార్యకలాపాల‌ సమాచారం తెల‌పండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుట్కా మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాల‌ సమాచారం తెల‌పాల‌ని నిజామాబాద్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్ల‌డిరచారు.

నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజనల్‌ పరిధిలో ఎక్కడైనా గుట్కా మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నడుస్తున్నట్టు తెలిస్తే క్రింది నెంబర్లకు సమాచారం అందించాల‌న్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి రివార్డు ఇస్తామన్నారు. స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్‌పెక్టర్‌ 94407 95452, స్పెషల్‌ బ్రాంచ్‌ నెంబర్‌ 94906 18000, అలాగే 94913 98540 కు సమాచారం ఇవ్వవచ్చని కమీషనర్‌ పేర్కొన్నారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article