డిచ్పల్లి, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారానికి తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపల్ డా.వాసం చంద్రశేఖర్ ఎంపికయినట్లు తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య నసీం తెలిపారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత ఇవ్వబడుతున్న ఉత్తమ రాష్ట్ర అధ్యాపక పురస్కారాన్ని ఈ యేడు డా.వాసం చంద్రశేఖర్ అందుకోబోతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన ఉత్తర్వులను రిజిస్ట్రార్ మెయిల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యాలయం నుంచి అందుకున్నట్లు వివరించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాప దినాల కారణంగా సెప్టెంబర్ 5 వ తేదీన పురస్కారాన్ని అందించలేకపోయారన్నారు. అదే విధంగా కొవిద్ -19 నిబంధనల నేపథ్యంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్లు మాత్రమే రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యాలయంలో పురస్కారాలను తీసుకొని ఆయా ఉత్తమ అధ్యాపకులకు అందించవలసిందిగా ఉత్తర్వులు అందినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డా.వాసం చంద్రశేఖర్ ఇదివరకు యూనివర్శిటీలో యూజీసీ, రూసా కో-ఆర్డినేటర్‌గా, రూసా కమిటీ మెంబర్‌గా బాధ్యతలు నిర్వర్తించారన్నారు.
2000-2008 వరకు ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలను పర్యటించి అమెరికా, తైవాన్, బెల్జియం, దక్షిణాఫ్రికాలోని వివిధ విశ్వవిద్యాలయాలలో శాస్త్రవేత్తగా వివిధ హోదాల్లో పనిచేసి అనుభవం గడిరచారన్నారు. ఇండియా / దక్షిణాఫ్రికా ఇంటర్నేషనల్ సంయుక్త పరిశోధనా ప్రాజెక్ట్‌కు ప్రిన్సిపల్ ఇన్విస్టిగేటర్ 2012 నుంచి పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చ పార్లమెంట్లో కూడా ప్రస్తావనకు వచ్చిందన్నారు. 2014 నుంచి రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ లండన్‌కు పానెల్ మెంబర్‌గా ఉన్నారని, 2015 నుంచి ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్‌లో టైంస్ మరియు క్యూ అండ్ ఎస్ సంస్థకు రీసోర్స్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారన్నారు.
ప్రస్తుతం ప్రిన్సిపల్ హోదాలో పాలక మండలి సభ్యులుగా ఉండి ఉత్తమ రాష్ట్ర అధ్యాపక పురస్కారానికి ఎంపికైన డా.వాసం చంద్రశేఖర్ తెలంగాణ విశ్వవిద్యాలయానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డి) లో ఎన్ఐఆర్ఎఫ్ జాతీయ ర్యాంకింగ్ సాధించడమే తన లక్యంగా పని చేస్తానన్నారు. ఉపకులపతి నీతూ కుమారి ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య నసీంకు కృతజ్ఞతలు తెలిపారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021