Breaking News

పెట్రోల్‌ బంకుల్లో హైటెక్‌ మోసం

కామారెడ్డి బడా వ్యాపారే సూత్రధారి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యాధునిక టెక్నాల‌జి అందుబాటులోకి రావడంతో అనేక రంగాల్లో మోసాలు జరుగుతున్నాయి. కాగా పెట్రోల్‌ బంకుల్లో మోసాలు కొత్తేం కాకపోయినా ఇటీవల‌ ఎక్కువయ్యాయి. పెట్రోల్‌ బంకుల్లో వాడే చిప్‌లో వాహనదారుల్ని బురిడి కొట్టిస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఇవి జరిగాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అవకతవకల‌కు పాల్ప‌డుతున్న పెట్రోల్‌ బంకుల‌పై ఎస్‌వోటి పోలీసులు దాడులు నిర్వహించారు.

పెట్రోల్‌ తక్కువ వచ్చి మీటర్‌ మాత్రం కరెక్టుగా చూపించేలా చిప్‌లు అమర్చినట్టు గుర్తించారు. పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకులు ఇలా జనాల‌ను మోసం చేస్తున్నట్టు గుర్తించారు. 13 బంకులు సీజ్‌ చేశారు కూడా. అలాగే ఏపిలో 26 బంకుల‌ను అక్కడి పోలీసులు సీజ్‌ చేసినట్టు హైదరాబాద్‌ ఎస్‌వోటి పోలీసుల‌ సమాచారం. ప్రత్యేక చిప్‌ల‌ను బంకు యజమానులు మహారాష్ట్ర నుంచి తెప్పించినట్టు తెలుస్తుంది.

వీరంతా ముఠాగా ఏర్పడి మోసాల‌కు పాల్ప‌డుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటువంటి 26 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోట్ల రూపాయల‌ మోసం చేసినట్టు పోలీసుల‌ విచారణలో తేలింది.

ఇదిలా ఉండగా ఇంధన మోసానికి కామారెడ్డి కేంద్ర బిందువు అయినట్టు తెలుస్తోంది. కామారెడ్డికి చెందిన ఓ బడా వ్యాపారి ఇందుకు సూత్రధారి అయ్యాడని సమాచారం. కామారెడ్డి పరిసర ప్రాంతాల్లోని రెండు పెట్రోల్‌ బంకుల్లో ఈ మోసం జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా సదరు వ్యాపారి ముంబయి నుంచి కొందరు వ్యక్తులతో సాఫ్ట్‌వేర్‌ తెప్పించి విక్రయించాడని సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ఇలా మూడు రాష్ట్రాల‌కు సాఫ్ట్‌వేర్‌ అందజేస్తు అంతరాష్ట్ర ముఠా మోసాల‌కు పాల్ప‌డుతుంది.

ఏదేమైనా ఏయే రంగాల్లో టెక్నాల‌జి ఉపయోగిస్తున్నారో వాటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ చర్యల‌కు పాల్ప‌డితే ప్రజలు మోసాల‌ బారిన నుండి కాపాడబడతారని అంటున్నారు.

Check Also

ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వీరుడు

కామరెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొండ లక్ష్మణ్‌ బాపూజీ 105 వ జయంతి సందర్భంగా ...

Comment on the article