Breaking News

ప్రయివేటు ఉపాధ్యాయుల‌ను ఆదుకోవాలి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బాన్సువాడ నియోజవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల్లోని ప్రైవేట్‌ విద్యాసంస్థల‌ యాజమాన్యాల‌తో, ఉపాధ్యాయుల‌తో సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ బ్యాంక్‌ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డిని ప్రైవేట్‌ ఉపాధ్యాయ సంఘాల‌ ప్రతినిధులు కలిశారు. కరోనా లాక్‌డౌన్‌తో ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నామని ఆదుకోవాల‌ని వినతి పత్రం అందించారు.

భాస్కర్‌రెడ్డి స్పందిస్తూ బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల‌ ప్రైవేట్‌ ఉపాధ్యాయుల‌ను ఆదుకునేలా ప్రైవేట్‌ విద్యా సంస్థల‌తో చర్చించాల‌ని స్థానిక విద్యాశాఖ అధికారిని స్థానిక నాయకుల‌ను కోరారు.

సోమవారం ప్రైవేటు విద్యాసంస్థల‌ యాజమాన్యాలు, ఉపాధ్యాయుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల‌ విద్యాశాఖ అధికారి స్థానిక మండల‌ నాయకులు పాల్గొని ప్రైవేట్‌ ఉపాధ్యాయుల‌ సమస్యల‌పై చర్చించారు. వివిధ విద్యా సంస్థల‌లో పనిచేసే ఉపాధ్యాయుల‌ను మానవతా దృక్పథంతో ఆదుకోవాల‌ని డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి సూచించడంతో ప్రైవేట్‌ విద్యాసంస్థలు తమ తమ పాఠశాల‌లో పనిచేసే ఉపాధ్యాయుల‌ను ఆదుకుంటామని తెలిపాయి..

ప్రైవేట్‌ ఉపాధ్యాయులు ఆనందంతో వారు కోరిన వెంటనే స్పందించిన పోచారం భాస్కర్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మండల‌ విద్యాశాఖ అధికారి నాగేశ్వర్‌ రావు, జిల్లా ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు అంజిరెడ్డి, బాన్సువాడ, బీర్కూర్‌ నసురుల్లాబాద్‌ మండలాల‌ ఎంపీపీలు దొడ్ల నీరజ వెంకటరామ్‌ రెడ్డి, రఘు, పాల్తే విట్టల్‌, జడ్పీటీసీలు స్వరూప సాయిలు, జణుభై ప్రతాపసింగ్‌, బాన్సువాడ పట్టణ మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, బాన్సువాడ ఏఎంసీ చైర్మన్‌ పాత బాల‌కృష్ణ, పాక్స్‌ చైర్మన్లు కృష్ణారెడ్డి, పెరిక శ్రీనివాస్‌, తెరాస పార్టీ ప్రెసిడెంట్‌ వీరేశం, ప్రభాకర్‌ రెడ్డి, నస్రుల్లాబాద్‌ మండల‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు సాయిలు, జడ్పీ కోఆప్షన్‌ మజీద్‌ పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలి

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మొస్రా మండల‌ కేంద్రంలో మండల‌ ప్రజాపరిషత్‌ సర్వసభ్య ...

Comment on the article