Breaking News

గిరిజన ఆవాసాల‌ను గుర్తించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీఎం గిరివికాస్‌ పథకంపై సంబంధిత శాఖల‌ అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల‌ అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు.

ఇప్పటివరకు గుర్తించిన 52 విద్యుత్‌ మోటార్ల బోర్‌ డ్రిల్లింగ్‌ యూనిట్స్‌కు గాను 32 యూనిట్లు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 20 యూనిట్లు ప్రోగ్రెస్‌లో ఉన్నవని, ఎంపీడీవోల‌ ద్వారా గిరిజన ఆవాసాల‌ను గుర్తించి పాపులేషన్‌ బట్టి మండలానికి రెండు యూనిట్స్‌ చొప్పున ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో డిఆర్‌డివో (పూఅబా) శ్రీనివాస్‌ డిటిడివో సంధ్యారాణి, విద్యుత్‌ శాఖ, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు ...

Comment on the article