Breaking News

మరొక రోజు గడువు పెంపు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌, దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి ఆదేశానుసారం డిగ్రీ కళాశాల‌లో ప్రవేశాల‌ కోసం ఏర్పాటు చేసిన దోస్త్‌ ఫేస్‌ – 1 ప్రక్రియను మరొక రోజు పొడిగిస్తున్నట్లు తెలంగాణ విశ్వవిద్యాల‌య రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం తెలిపారు. దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ 7 వ తేదీతో ముగిసిపోగా విద్యార్థుల‌ అభ్యర్థన మేరకు 8 వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో విద్యార్థుల‌ అభ్యర్థన మేరకు మరొక రోజు కూడా అంటే 9 వ తేదీన రిజిస్ట్రేషన్స్‌ చేసుకోవడానికి దోస్త్‌ కన్వీనర్‌ అవకాశం కల్పించినట్లు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదో వారు పొడిగించిన రోజును అంటే 9 వ తేదీని సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.

ఈ విషయాన్ని డిగ్రీ కళాశాల‌ల ప్రధానాచార్యులు, విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల‌న్నారు. ఎవరికైనా సందేహాలుంటే తెలంగాణ విశ్వవిద్యాల‌యం హెల్ప్‌ లైన్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాల‌ కోసం వెబ్‌ సైట్‌ను దర్శించాల‌ని సూచించారు.

Check Also

ఒకరోజు గడువు పొడిగింపు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ మరియు ...

Comment on the article