నిజామాబాద్, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో అభివ ృద్ధి పనులను నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ ప్రారంభించారు. నగర అభివృద్ధిలో భాగంగా పట్టణ ప్రగతిలో ప్రతి డివిజన్‌కు కేటాయించిన 10 లక్షల రూపాయలతో (మొత్తం 8 డివిజన్లలో 80 లక్షలతో) చేపట్టే పనులను నగరంలోని 10వ డివిజన్లలో 80 క్వాటర్స్ వద్ద 10 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ పనులను ప్రారంభించారు.
అలాగే 11వ డివిజన్ హాసద్బాబానగర్లో 10 లక్షల నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను, 12వ డివిజన్ రహేమునిస్సా మజీద్ వద్ద 10 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. 13వ డివిజన్ ధర్మపురి హిల్స్ రోడ్డు వద్ద 10 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను, 30వ డివిజన్ గౌస్‌ల మజీద్ వద్ద 10 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను మేయర్ ప్రారంబించారు. 30వ డివిజన్ కార్పొరేటర్ సలీమ్ తన సొంత నిధులతో డివిజన్లలో వివిధ ప్రాంతాలలో చెత్త వేయటానికి తయారు చేయించిన చెత్త జాలీలను నగర మేయర్, డిప్యూటీ మేయర్ కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
54వ డివిజన్ నిజాముద్దీన్ మజీద్ వద్ద 10 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను, 55వ డివిజన్లో మాపల్లి వాటర్ ట్యాంక్ వెనకాల 10 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. 60వ డివిజన్ ఉజ్మా గార్డెన్ వద్ద 10 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, మున్సిపల్ కమిషన్ జితేష్.వి.పాటిల్, ముస్తాక్ అహ్మద్, కార్పొరేటర్లు కోమల్, మీర్ ఈర్షద్ అలీ, హరూన్ ఖాన్, సలీమ్, షకీల్ అహ్మద్, నజీర్, యస్మీన్ సుల్తానా, వాజిద్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ మహిపాల్ నాయకులు పవార్, ఆకాష్, పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు – పలు అంశాలపై సమీక్ష - March 2, 2021
- టీయూ ఐక్యూఎసీ డైరెక్టర్‌గా ఆచార్య కౌసర్ మహ్మద్ - March 2, 2021
- ‘‘డైరెక్ట్ టాక్సెస్’’ పుస్తకావిష్కరణ - March 2, 2021