నిజామాబాద్, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగంపై సమగ్రంగా చర్చించాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన పి.డి.ఎస్.యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి రామును హైదరాబాదులోని సంస్థ కార్యాలయంపై పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారని, అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని పిడిఎస్యు జిల్లా అధ్యక్షురాలు కల్పన అన్నారు.
బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీసం అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగంపై సమగ్రంగా చర్చించాలని, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు దోపిడీ నివారించేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఆన్లైన్ విద్యలో ఎదురవుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యాలు నెలనెలా వేతనాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం చేయాలని కల్పన డిమాండ్ చేశారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021