Breaking News

రక్తదానం చేసిన ఎమ్మార్వో

కామరెడ్డి, సెప్టెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌కి చెందిన భూమేష్‌ 28 సంవత్సరాల‌ యువకుడు ప్రమాదంలో గాయపడటంతో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరమైంది. కాగా ఎల్లారెడ్డి ఎమ్మార్వో శ్రీనివాస్‌ రావు వీ.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో మంగళవారం రక్తదానం చేశారని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు.

రక్తదానం చేసిన ఎమ్మార్వోకి కృతజ్ఞతలు తెలిపారు. గత నాలుగు నెల‌ల కాలంలో 250 మందికి సకాంలో రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడామని 15 సంవత్సరాల‌ నుండి దాదాపు 5 వేల‌ మందికి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఎమ్మార్వోకు వివరించారు. కామారెడ్డి రక్తదాతల‌ సమూహం ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాల‌ను తెలుసుకొని ఎమ్మార్వో అభినందించారు. కార్యక్రమంలో టెక్నీషియన్‌ చందన్‌, చందు, అంజి ఉన్నారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article