నిజామాబాద్, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛభారత్ మిషన్‌లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు ఖర్చు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం జెడ్పి చైర్మన్ విట్టల్ రావుతో కలిసి పల్లె ప్రగతి, వైకుంఠ ధామాలు, కంపోస్టు షెడ్, పల్లె ప్రకృతి వనాలపై, ఎంపీపీలు, ఎండిఓలు, జెడ్పిటిసిలు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఎంపిఓల తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
నిజామాబాద్ జిల్లా మాడల్ వైకుంఠ ధామాలు దేశానికి ఆదర్శం కావాలన్నారు. కంపోస్ట్ షెడ్డు నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో, వైకుంఠధామాల నిర్మాణంలో రెండో స్థానంలో ఉందన్నారు. గ్రామాలలోని ప్రజాప్రతినిధులు, అధికారులందరి సహకారంతో మొదటి స్థానం రావడానికి ప్రయత్నిస్తామన్నారు. స్వచ్ఛభారత్ కోసం కొన్ని యాక్టివ్‌గా ఉన్న గ్రామ పంచాయతీలను మండలానికి 2 గ్రామాలు ఎంపిక చేయాలని ఎంపీడీఓకు సూచించారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో డబ్బు రావాలంటే మీ గ్రామాలలో ఉన్న పరిస్థితులు మారాలని, చెత్త నిర్వహణ మీద దృష్టి పెట్టాలన్నారు.
చెత్త నిర్వహణలో మండలానికి రెండు గ్రామ పంచాయతీలు సెలెక్షన్ చేయడం జరిగిందని, ఆ రెండు గ్రామపంచాయతీలలో సిస్టమేటిక్‌గా చెత్త నిర్వహణ చేయగలిగితే ఆ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుండి అదనపు ఫండ్ వస్తుందని, గ్రామం హెల్త్ పరంగా శానిటేషన్ పరంగా చాలా రకాలుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని, హాస్పిటల్ ఖర్చు తగ్గుతాయన్నారు. మండల హెడ్ క్వాటర్ గ్రామ పంచాయతీ రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మున్సిపల్ స్టాండర్డ్‌లో పనులు చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు.
పల్లె ప్రగతి పనులు స్పీడ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తొందరగా పూర్తి చేయాలని, మండలంలోని గ్రామాలలో ఎక్కడైనా పనులు వెనుకబడినట్లైతే సంబంధించిన ప్రజా ప్రతినిధులు, ఎంపిపి, జెడ్పిటిసిలు వారి భుజాన వేసుకుని వారి పరిధిలో ఉన్న గ్రామాలలో పల్లె ప్రగతి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఇవ్వడం జరిగిందన్నారు.
వైకుంఠ ధామాలు గ్రామాలలో పేద వారు చనిపోయినా, ధనికుడు చనిపోయిన వైకుంఠధామం గౌరవప్రదంగా వెళ్లేలా ఉండాలని, వైకుంఠధామం పార్కులా మార్చాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని, వైకుంఠ దామం విషయంలో మీ మండలాన్ని ఆదర్శంగా మార్చాలని, హరితహారం ప్లాంటేషన్ ఎక్కువగా రోడ్లకు ఇరువైపులా, వైకుంఠ దామములో, కంపోస్టు షెడ్ దగ్గర పెట్టి ప్రతి మొక్కను రక్షించుకోవాలని, సుమారు మూడు వేల మంది వన సేవకులు పని చేస్తున్నారని, వారికి రోజుకు 237 రూపాయలు ఇస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజుకు 7 లక్షల రూపాయలు ఇస్తున్నామని, ఏ రోడ్డు చూసినా 5 మీటర్లకు ఒక మొక్క ఉండాలని, వన సేవకులు రెండు గంటలు గ్రామంలో శానిటేషన్ పనులు చేయాలని, మిగతా సమయం మొక్కలను పెంచాలని, జిపి నుండి వన సేవకునికి వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వాలన్నారు.
మొక్కలు పెంచకుంటే సోషల్ ఆడిట్లో ఇబ్బంది అవుతుందని, ఏవిన్యూ ప్లాంటేషన్ అయితే నాలుగువందల మొక్కలకు ఒకరిని, వైకుంఠధామం కంపోస్ట్ షెడ్డులో ఒక్కరిని మొక్కలు పెంచుటకు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకరికి వెయ్యి మొక్కలు అప్పగించాలని, గ్రామాలలో మిషన్ భగీరథ వాటర్ వచ్చిన గ్రామాలలో త్రాగునీటి బోర్లు వాడరాదని, వాటి విద్యుత్ వృధా ఖర్చు అవుతుందని గ్రామ పంచాయతీకి అదనపు భారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, జడ్పీ సీఈవో గోవింద్, డిఆర్డిఓ శ్రీనివాస్, స్టేట్ ఎస్బిఎం నుండి శ్రావ్య, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బార్లకు భారీగా దరఖాస్తులు - March 6, 2021
- అంచనాలు ఏర్పరచుకోవడమే కాదు వాటిని సాధిస్తేనే అత్మతృప్తి - March 6, 2021
- బోధన్ బార్ అసోసియేషన్ ఎన్నికలు - March 6, 2021