హైదరాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ సాహితీవేత్త రామా చంద్రమౌళికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతి భవన్లో కాళోజీ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. కాళోజి పురస్కారానికి రామా చంద్రమౌళి సంపూర్ణ అర్హుడని సిఎం అన్నారు. కాళోజీ సాహిత్య పురస్కారం కింద 1 లక్ష 1 వెయి 116 నగదు, జ్ఞాపిక అందించి శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సాంస్కతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ ...
Read More »Daily Archives: September 9, 2020
కొనుగోలు, అమ్మకాలు రికార్డు మెయింటెన్ చేయాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని ఔషద దుకాణాల్లో గత రెండు రోజులుగా తనికీలు చేపట్టినట్టు ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. ఇందులో భాగంగా ఆర్మూర్‌లోని పలు మెడికల్ దుకాణాలు, నిజామాబాద్‌లోని ఖలీల్‌వాడి, బోధన్ రోడ్డు, సరస్వతి నగర్, ద్వారకానగర్, మానిక్‌భండార్ తదితర ప్రాంతాల్లో పలు మందుల దుకాణాలు తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణాలకు నోటీసులు జారీచేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆర్ఎంపిలు, పిఎంపిలు మందులు పెట్టుకోకూడదని, హోల్‌సేల్ ...
Read More »సిఎం చిత్రపటానికి పాలాభిషేకం
నిజాంసాగర్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి విఆర్ఏలు అందరూ కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం అధ్యక్షులు రాములు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ విఆర్ఏలను పే స్కేల్ ఫోర్త్ ఎంప్లాయిస్ గా గుర్తించినందుకు హర్షం వ్యక్తం చేశారు. గత అనేక సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు కూడా వీఆర్ఏల గురించి పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సాదుల ప్రవీణ్, వీఆర్ఏలు భూమయ్య, సాయిలు, ...
Read More »గర్భిణీలకు శ్రీమంతం కానుకలు
బోధన్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం బోధన్ మండలం మూడు క్లస్టర్‌లోని అంగన్వాడి సెంటర్లో బోధన్ ఎమ్మెల్యే ఎం.డి.షకీల్ అమీర్ సతీమణి అయేషా ఫాతిమా ఆమ్మేర్ గర్భిణీలకు కులమతాలకు అతీతంగా శ్రీమంతం కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద మహిళలు కోవిడ్-19 కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ సందర్భంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, పేద గర్భిణీలు శ్రీమంతం కూడ చేసుకోలేని పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్ ఎమ్మెల్యే పేద కుటుంబాల గురించి ...
Read More »వారం రోజుల్లో ప్లాంటేషన్ పూర్తిచేయాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండలం జకోర, వర్ని గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి. బుధవారం పర్యటనలో భాగంగా గ్రామాలలో రైతు వేదికలు పల్లె ప్రకృతి వనాల పనులు పరిశీలించారు. వర్ని సర్పంచ్ కోరిన వెంటనే ప్రకృతి వనం అభివృద్ధికి 3 లక్షలు మంజూరు చేస్తామన్నారు. గ్రామాలలో నిర్మాణంలో ఉన్న రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులు సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రైతు ...
Read More »స్వేచ్ఛా వాయువులు కాంక్షించారు
డిచ్పల్లి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కళాశాల ఆవరణలో పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు 106 వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ కళాశాల ప్రధానాచార్యులు డా.వాసం చంద్రశేఖర్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి స్వేచ్చా వాయువులను కాంక్షించిన స్ఫూర్తి ప్రధాత కాళోజీ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా వెలిసిన కాళోజీకి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదు ఇచ్చి గౌరవించిందన్నారు. తెలంగాణ భావజాలాన్ని విస్తరింపజేసి ...
Read More »ప్రగతి పనుల స్పీడ్ పెంచాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛభారత్ మిషన్‌లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు ఖర్చు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. పల్లె ప్రగతి, వైకుంఠ ధామాలు, కంపోస్టు షెడ్, పల్లె ప్రకృతి వనాలపై ఎమ్మార్వోలు, ఎండివోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ సెక్రెటరీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనం ప్రతి గ్రామంలో పెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఇప్పటికే ...
Read More »కాళోజికి ఘన నివాళి
కామరెడ్డి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రసిద్ధ కవి, రచయిత కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు వెంకటేశ్ ధోత్రే, ఎల్లారెడ్డి ఆర్డీఓ శ్రీను, జిల్లా కలెక్టరేటు పరిపాలనాధికారి శ్రీనివాసరావు, జిల్లా అధికారులు కాళోజీ నారాయణ రావు చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు.
Read More »సాయంత్రంలోగా నమోదు చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెవెన్యూ కోర్టు కేసులన్నింటిని బుధవారం మధ్యాహ్నం లోగా ఐఎల్‌ఆర్‌ఎంఎస్ వెబ్సైట్ నమోదు చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ రెవిన్యూ డివిజనల్ అధికారులు తహశీలుదార్లను ఆదేశించారు. బుధవారం ఆయన ఆర్డిఓ, తహశీల్దార్లు సెల్ కాన్ఫరెన్సులో మాట్లాడుతూ, రెవిన్యూ కోర్టు కేసులు ఐఎల్‌ఆర్‌ఎంఎస్ వెబ్ సైట్లో బుధవారం మధ్యాహ్నం లోగా నమోదు చేయాలని తెలిపారు. కంపోస్ట్ షెడ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలకు సంబంధించి స్థల సేకరణ కానీ గ్రామంలో బుధవారం సాయంత్రం లోగా ...
Read More »