Breaking News

స్వేచ్ఛా వాయువులు కాంక్షించారు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని యూనివర్సిటీ కళాశాల‌ ఆవరణలో పద్మ విభూషణ్‌ కాళోజీ నారాయణ రావు 106 వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ కళాశాల‌ ప్రధానాచార్యులు డా.వాసం చంద్రశేఖర్‌ కాళోజీ చిత్రపటానికి పూల‌మాల‌ వేసి నివాళుల‌ర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి స్వేచ్చా వాయువుల‌ను కాంక్షించిన స్ఫూర్తి ప్రధాత కాళోజీ అన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా వెలిసిన కాళోజీకి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ బిరుదు ఇచ్చి గౌరవించిందన్నారు. తెలంగాణ భావజాలాన్ని విస్తరింపజేసి నేటి తరం వారసులుగా తమకందరికి ఆదర్శంగా నిలిచారన్నారు. తెలంగాణ విశ్వవిద్యాల‌య పాల‌క మండలి సభ్యులు డా.కె.రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ కాళోజీతో కలిసి తిరిగిన అనుభవాల‌ను పంచుకున్నారు. కాళోజీ మృదు స్వభావులుగా కనిపించినా, ఎంతో పోరాట స్ఫూర్తి ప్రదర్శించేవారన్నారు.

నాటి నిజాంను, నేటి వరకు ఉన్న ఆంధ్రా పాల‌కుల‌ను ఎదిరించి నిలిచారన్నారు. నా గొడవలో ఆయన తెలిపిన ప్రతి అంశంతో తెలంగాణ జనజీవనం, పోరాటం ముడిపడి ఉందన్నారు. తెలంగాణ ఆత్మ ఆయన భాషలో నిలువెల్లా తొణికిసలాడుతుందన్నారు. పీఆర్‌ఓ డా.వి.త్రివేణి మాట్లాడుతూ తెలంగాణ ఆత్మాభిమానాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించి సమర సాహితీ ప్రదాతగా కాళోజీ నిలిచారన్నారు.

బడి పలుకుల‌ భాష కంటే పలుకుబడుల‌ భాష అంటే ఎంతో గౌరవాన్ని చూపేవారన్నారు. కార్యక్రమంలో కళాశాల‌ వైస్‌ ప్రిన్సిపల్‌ డా. శాంతాబాయి, డా. అత్తర్‌ సుల్తానా, డా. కె. సంపత్‌ కుమార్‌, డా. మూసా ఖురేషి, సంపత్‌ తదితర అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

ఒకరోజు గడువు పొడిగింపు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ మరియు ...

Comment on the article