Breaking News

వారం రోజుల్లో ప్లాంటేషన్‌ పూర్తిచేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలం జకోర, వర్ని గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి. బుధవారం పర్యటనలో భాగంగా గ్రామాల‌లో రైతు వేదికలు పల్లె ప్రకృతి వనాల‌ పనులు పరిశీలించారు. వర్ని సర్పంచ్‌ కోరిన వెంటనే ప్రకృతి వనం అభివృద్ధికి 3 ల‌క్షలు మంజూరు చేస్తామన్నారు. గ్రామాల‌లో నిర్మాణంలో ఉన్న రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల‌ పనులు సెప్టెంబర్‌ చివరి నాటికి పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ప్రతి రైతు వేదిక దగ్గర ల్యాండ్‌ లెవెలింగ్‌ ప్లాంటేషన్‌, అప్రోచ్‌ రోడ్డు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో చేయాల‌న్నారు. సీఎం డైరెక్టుగా మానిటరింగ్‌ చేస్తున్న పనుల‌ని, వేగంగా పూర్తి చేయాల‌న్నారు. గ్రామంలో శానిటేషన్‌ మంచిగా ఉండాల‌ని, రాత్రిపూట ఏ ప్రాంతానికి వెళ్ళినా వెలుతురు ఉండాల‌ని, పెద్ద మొక్కలు నాటాల‌ని, ఏ రోడ్డు చూసినా మొక్కలు ఉండాల‌న్నారు. 14 ఫీట్ల ఎత్తున్న మొక్కలు ఇంటింటికి రెండు పెట్టించినట్లయితే ఊరు రూపురేఖలు మారిపోతాయని, మహిళా సంఘాలు, దుకాణాల‌ ముందు మొక్కలు పెట్టించాల‌ని, కరెంటు తీగలు ఉన్న దగ్గర తక్కువ సైజ్ పూల‌ మొక్కలు పెట్టాల‌న్నారు.

పగోడా, కదంబ, కొబ్బరి, వేప పెద్ద సైజు మొక్కలు ప్రైవేటు నర్సరీలో ల‌భిస్తాయని, అవి కొని గ్రామంలో ప్లాంటేషన్‌ చేయాల‌న్నారు. వర్ని బస్టాండ్‌ దగ్గరి స్థలంలో విలేజ్‌ పార్క్‌ ఏర్పాటు చేయాల‌ని పార్క్‌ బ్యూటిఫుల్‌గా ఉండాల‌ని, లెవెల్‌ చేయాల‌ని, మెట్లు ఏర్పాటు చేసుకోవాల‌ని, మండల‌ కేంద్రం కాబట్టి విలేజ్‌ పార్క్‌ చాలా బ్యూటిఫుల్‌గా ఉండాల‌న్నారు.

వారంలో ప్లాంటేషన్‌ పూర్తిచేయాల‌ని, వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాల‌న్నారు. జకోరా గ్రామంలో 2 వేల‌ మొక్కలు నాటాల‌ని, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకోవాల‌ని, ప్రతి జిపిలో పల్లె ప్రకృతి వనం తప్పక ఉండాల‌న్నారు. కలెక్టర్‌ వెంట డిఆర్డిఓ రాజేశ్వర్‌, తహసీల్దార్‌ విట్టల్‌, ఎంపీడీవో బషీరుద్దీన్‌, సర్పంచ్‌లు నాగమణి, గోదావరి, సింగిల్‌ విండో చైర్మన్‌ సాయిబాబా తదితరులు ఉన్నారు.

Check Also

రెండు తులాల గుండ్లు పోగొట్టుకుంది… తరువాత ఏమైంది….

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ గ్రామానికి చెందిన ...

Comment on the article