నిజామాబాద్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ పథకాలపై లోన్స్‌కు సంబందించి బ్యాంకర్స్, జిల్లా అధికారులతో డిఎల్ఆర్సి సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. గురువారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో వ్యవసాయ రుణాలు, కోవిడ్ లోన్స్, బ్యాంకు లింకేజీ, ఎస్సి వెల్పేర్, బీసీ వెల్ఫేర్, ఇండస్ట్రీస్, ఫిషరీస్, డైరీ, ఆత్మ నిర్మల్ భారత్ అభియాన్ సంబంధిత లోన్లపై బ్యాంకర్స్, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వారంలో అన్ని ...
Read More »Daily Archives: September 10, 2020
భారీగా నిషేదిత పొగాకు స్వాధీనం
నిజామాబాద్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ నరేందర్, షాకీర్ అలీ, సిబ్బంది కలసి టౌన్ పిఎస్ పరిధిలో నిషేధిత గుట్కా, తయారీ కేంద్రాలు, గోదాములపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేదిత పొగాకు సంచులు 175, లతీఫ్ లేబుల్ గుట్కా బ్యాగులు 43 సీజ్ చేశారు. గుట్కా ఫ్యాక్టరీ మెషిన్ – 5, తంబాకు బ్యాగులు -32, తంబాకు కెమికల్ లిక్విడ్ డ్రమ్ములు – 3, గుట్కా ...
Read More »కార్పొరేట్ల నుండి కాపాడండి!
బోధన్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంపెనీలకు వ్యవసాయాన్ని కట్ట బెట్టే మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు ఆర్డినెన్సులను 14 నుంచి జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు పడాల శంకర్ డిమాండ్ చేశారు. బోధన్ మండలం ఖాజాపూర్ గ్రామంలో రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పంటల కొనుగోళ్లకు కార్పొరేట్లకు స్వేచ్చ వాణిజ్యం, కంపెనీలకు కాంట్రాక్ట్ వ్యవసాయం, వ్యవసాయోత్పత్తుల నిల్వలపై పరిమితి రద్దు, వ్యవసాయ దారులపైనా, గహ ...
Read More »పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధైర్య సాహసాలను ప్రదర్శించి, ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలలు, స్వచ్చంద సంస్థలకు (2021) సంవత్సరానికి గాను బాలశక్తి, బాల కళ్యాణ్ పురస్కారాలు భారత ప్రభుత్వం ప్రదానం చేయనున్నట్లు జిల్లా మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవద్ధుల సంక్షేమాధికారి అనురాధ తెలిపారు. నూతన ఆవిష్కరణలు అసాధారణ ప్రతిభా పాటవాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు, తదితర అంశాలకు అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. అవార్డులకు ఐదేళ్ల నుంచి 18 ...
Read More »కోవిడ్ జాగ్రత్తలు పాటించండి
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు కోవిడ్ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది కావున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. కోవిడ్ 19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు తన వంతు బాధ్యత వహించాలని, తన కుటుంబ సభ్యులందరు ...
Read More »సమస్య పరిష్కారం కోసం మంత్రిని కలిశారు
రెంజల్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దండిగుట్ట గ్రామంలో గత 9 నెలలుగా వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ని గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. పూజారుల రాష్ట్ర అధ్యక్షుడు శివరాం మహరాజ్ మంత్రికి దండిగుట్ట తాండ సమస్యను వివరించారు. సేవాలాల్ జగదాంబ మాత ఆలయం పక్కన వైకుంటధామం నిర్మాణం చేపట్టకూడదని అక్కడే బస్టాండ్ మరియు జనావాసాలకు దగ్గర ఉందని ఇందుకు బదులుగా జనావాసానికి ...
Read More »అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నిజామాబాద్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నగరంలోని పలు డివిజన్లలో అభివద్ధి పనులను నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ ప్రారంభించారు. నగర అభివద్ధిలో భాగంగా 8 డివిజన్లలో సుమారు 80 లక్షల నిధులతో చేపడుతున్న పనులను స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. 50వ డివిజన్ పోతలింగమయ్యా గుడి వద్ద సుమారు 10లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ, సీసీ రోడ్లు పనులను ప్రారంభించారు. అలాగే 58వ డివిజన్ దారుగల్లీ మజీద్ వద్ద సుమారు 10లక్షల నిధులతో సీసీ ...
Read More »వారి త్యాగాలు స్మరించుకోవాలి
కామరెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రామారెడ్డి ఎమ్మార్వోకు బిజెవైఎం రామారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బిజెపి యువ మోర్చా మండల అధ్యక్షులు ఇసాయిపేట నరేష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ రాష్ట్రానికి నిరంకుశ పాలన నుండి విముక్తి కలిగిందని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణాలో అనేక మంది అసువులు బాసిన వారి ప్రాణా మానాల త్యాగ ఫలితంగానే సెప్టెంబర్ ...
Read More »తన రచనలు యువతలో స్ఫూర్తి రగిల్చాయి…
నిజామాబాద్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాళోజీ చిత్రపటానికి అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) ఉషా విశ్వనాథ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కాళోజి తన రచనల ద్వారా పెత్తందారీ వ్యవస్థ ఎదురించాడని, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాళోజీ రచనలు యువతలో స్ఫూర్తి రగిల్చాయన్నారు. సామాజిక సమస్యలపై పోరాడిన మహనీయుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ రాజరాజేశ్వర ...
Read More »