Breaking News

పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధైర్య సాహసాలను ప్రదర్శించి, ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలలు, స్వచ్చంద సంస్థలకు (2021) సంవత్సరానికి గాను బాలశక్తి, బాల కళ్యాణ్‌ పురస్కారాలు భారత ప్రభుత్వం ప్రదానం చేయనున్నట్లు జిల్లా మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవద్ధుల సంక్షేమాధికారి అనురాధ తెలిపారు. నూతన ఆవిష్కరణలు అసాధారణ ప్రతిభా పాటవాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు, తదితర అంశాలకు అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు.

అవార్డులకు ఐదేళ్ల నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలు (2020 ఆగస్టు 31 లోపు) ఉన్న వారు అర్హులన్నారు. అలాగే ఏడేళ్లు ఆపైన బాలబాలికల కోసం విశేషంగా కషి చేసి, వారి జీవితాల్లో మార్పు తెచ్చిన స్వచ్చంద సంస్థలు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హులైన బాలబాలికలు, స్వచ్చంద సంస్థలు వెబ్‌ సైట్‌ షషష.అషa-షషస.అఱష.ఱఅ లో ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, జిల్లా మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవద్ధుల సంక్షేమాధికారి అనురాధ వెల్లడించారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article