Breaking News

ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ పథకాలపై లోన్స్‌కు సంబందించి బ్యాంకర్స్‌, జిల్లా అధికారులతో డిఎల్‌ఆర్‌సి సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ రుణాలు, కోవిడ్‌ లోన్స్‌, బ్యాంకు లింకేజీ, ఎస్‌సి వెల్పేర్‌, బీసీ వెల్ఫేర్‌, ఇండస్ట్రీస్‌, ఫిషరీస్‌, డైరీ, ఆత్మ నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ సంబంధిత లోన్లపై బ్యాంకర్స్‌, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు.

వారంలో అన్ని లోన్స్‌ క్లియర్‌ చేయాలని, లోన్‌ వైవర్‌కు, రెన్యువల్‌కు సంబంధం లేదన్నారు. రైతులు క్రాప్‌ లోన్‌ మంజూరు చేయించుకోవాలని, క్రాప్‌ లోన్‌ రెన్యువల్‌ చేయించుకున్న వారికి పంటను బట్టి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌పై 30 శాతం అధికంగా ఇస్తారని, ఏ పంట వేస్తారో దాన్నిబట్టి ఎకరాకు 30 శాతం అధిక ఫైనాన్స్‌ ఉంటుందని, కట్టని వారికి 12.5 శాతం వడ్డీ పడుతుందన్నారు. కట్టిన వారికి 7 శాతం ఇంట్రెస్ట్‌ వస్తుందని ప్రాంప్ట్‌గా సంవత్సరంలోపు కడితే 3 శాతం తగ్గుతుందని, అన్ని పంటలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఉంటుందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని, జిల్లా అడ్మినిస్ట్రేషన్‌ సపోర్టుగా ఉంటుందన్నారు.

పట్టణాలలో కోవిడ్‌ వల్ల చాలా మందికి ఉపాధి పోయిందని, అలాంటి వారికి ప్రభుత్వ సపోర్టు ఉంటుందన్నారు. వ్యవసాయలోన్లు తక్కువగా ఉన్నాయని, అన్ని లోన్స్‌ వారంలో పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీధి వ్యాపారుల లోన్స్‌ గురించి రోజూ రెవ్యూ చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో వీధి వ్యాపారుల లోన్స్‌ ఇవ్వడంలో మనం రెండో స్థానంలో ఉన్నామన్నారు. వీధి వ్యాపారులనుండి 17 వేల రెండు వందల అప్లికేషన్లు వచ్చాయని, వారికి త్వరగా లోన్స్‌ ఇవ్వాలని, మంచి గ్రూప్స్‌ను బ్యాంకర్స్‌ ఎంకరేజ్‌ చేయాలన్నారు. సమావేశంలో ఎల్‌డిఎం జయసంతోషి, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, నాబార్డ్‌ జిఎం నాగేశ్వర్‌, బ్యాంకర్స్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు ...

Comment on the article