Breaking News

కోవిడ్‌ జాగ్రత్తలు పాటించండి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది కావున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. కోవిడ్‌ 19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు తన వంతు బాధ్యత వహించాలని, తన కుటుంబ సభ్యులందరు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఆరోగ్య కేంద్రంలో అవగాహన పోస్టర్ల ద్వారా అందరు తెలుసుకొని కోవిడ్‌ 19 బారిన పడరాదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. మాస్క్‌ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, జనం గుంపులుగా చేరకూడదు, తరుచుగా చేతులు శుభ్రపరచుకోవాలన్నారు.

పిల్లలు, గర్భిణీలు, వద్దులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్థులు విధుల్లోకి రాకుండా ఉండాలన్నారు. పౌష్టికాహారం, శుభ్రమైన నీరు, పరిసరాలు పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రచారంలో వి.సంజీవరెడ్డి ఎం. రాణి, విట్టల్‌రావు, జిల్లా ఆరోగ్య బోధకులు, కామారెడ్డిలో అశోక్‌ నగర్‌, ఎన్‌జివోస్‌ కాలనీ, విద్యానగర్‌, బస్టాండ్లలో, మున్సిపల్‌ రోడ్‌, నిజాంసాగర్‌ రోడ్‌, స్టేషన్‌ రోడ్‌, సిరిసిల్లరోడ్డు ,మార్కెట్‌, పెద్దమ్మ గల్లీ, వివేకానంద కాలనీ, పెద్దబజార్‌, సుభాష్‌ రోడ్డు, రాజీవనగర్‌, ఇందిరానగర్‌లో ప్రచారం చేసారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article