Breaking News

అడ్మిషన్‌ గడువు పెంపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ మరియు పిజి అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్‌ 24వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు నిజామాబాద్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బి.ఏ, బి.కాం, బిఎస్‌సి లలో అడ్మిషన్‌ పొందడానికి ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఓపెన్‌ ఇంటర్‌, ఐటిఐలో రెండు సంవత్సరాల కోర్సు చేసి పాస్‌ అయిన వారు సెప్టెంబర్‌ 24వ తేదీ లోపు అడ్మిషన్‌ తీసుకోవచ్చన్నారు. అలాగే పిజిలో చేరడానికి డిగ్రీ ఉత్తీర్ణత చేసి ఉండాలని సూచించారు. పూర్తి వివరాలకు అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. లేదా 7382929612 నెంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

Check Also

బిజెవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోడి 70వ జన్మదినం సందర్భంగా జాతీయ, రాష్ట్ర ...

Comment on the article