Breaking News

మహిళకు రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదులోని ప్రైవేటు వైద్యశాలలో 55 సంవత్సరాల మహిళకు రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలుని సంప్రదించారు. సమూహ క్రియాశీలక సభ్యుడు కిరణ్‌ సహకారంతో పట్టణానికి చెందిన సాయికిరణ్‌ ఏ నెగిటివ్‌ రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేయడానికి కామారెడ్డి రక్తదాతల సమూహం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు.

ప్రస్తుత తరుణంలో రక్తం లభించక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మంచి మనసుతో, మానవత్వంతో తోటి వారి ప్రాణాలు కాపాడడానికి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. రక్తదాతకు కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టెక్నీషియన్‌ ఏసుగౌడ్‌ ఉన్నారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article