కామారెడ్డి, సెప్టెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకతి వనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. తాడ్వాయి మండలంలోని తాడువాయి, చందాపూర్, సంగోజీ వాడి, కాలోజి వాడి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లోని పల్లె ప్రకతి వనాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రకతి వనాలతో ప్రజలకు మానసిక ప్రశాంతత కలుగుతోందని సూచించారు.
దగ్గరదగ్గరగా మొక్కలు నాటడం వల్ల చిట్టడవిలా ప్రకతి వనాలు మారుతాయని పేర్కొన్నారు. తాడువాయిలో శబరిమాత ఆశ్రమం సమీపంలో మరో పల్లె ప్రకతి వనం ఏర్పాటు చేయాలని సర్పంచ్, కార్యదర్శులను ఆదేశించారు. ఉపాధి పనులకు 20 శాతం పైన కూలీలు హాజరయ్యే విధంగా చూడాలని కోరారు. కంపోస్టు షెడ్ల ద్వారా చెత్తను సేంద్రియ ఎరువుగా తయారుచేసి గ్రామాల్లోని రైతులకు విక్రయించాలని పేర్కొన్నారు.
సేంద్రియ ఎరువుల ద్వారా పంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు పాదులు ఏర్పాటుచేసి, సంరక్షణ చేయాలని కోరారు. బ్రాహ్మణపల్లిలో పశువుల నీటి కుండీ సమీపంలో అపరిశుభ్రత వాతావరణం ఉండడంతో పరిశుభ్రంగా మార్చాలని సర్పంచ్‌కు సూచించారు. అదనపు కలెక్టర్ వెంకటేష్, డిఎల్పిఓ హరిసింగ్, ఎంపీడీవో లక్ష్మి, తహసిల్దార్ భుజంగరావు, ఉపాధిహామీ ఎపిఓ శ్రీనివాస్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021