Breaking News

108లో ఉద్యోగావకాశాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవీకే ఈఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో నడుపబడుతున్న 108 ఎమర్జెన్సీ అంబులెన్స్‌ వాహనాలలో పనిచేయుటకు ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నిషియన్‌ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్దుల నుండి దరఖాస్తులు స్వీకరించబడునని జిల్లా ప్రోగ్రోమ్‌ మేనేజరు భూమా నాగేందర్‌, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ దుర్గయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌, ఆధార్‌ కార్డు, ఒక జిరాక్స్‌ కాపీస్‌ సెట్‌ను వెంట తీసుకొని ఇంటర్వ్యూకి హాజరు కావాలన్నారు.

ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నిషియన్‌ పోస్టుకు అర్హతలు

విద్యార్హత – ఫుల్‌ టైం బి.యెస్‌.సి (లైఫ్‌ సైన్స్‌), లేదా బి.యెస్‌.సి (నర్సింగ్‌)

పనిచేయవల్సిన ప్రదేశం – హైదరాబాద్‌

వయసు – 22 నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి

ఎత్తు – 5 అడుగుల 4 అంగుళాలు, ఆ పైన

భాష – తెలుగు ఇంగ్లీష్‌ వ్రాయడం మరియు చదవడం రావాలి.

మెడికల్‌ – వర్ణ అంధత్వం ఉండకూడదు, శారీరక దఢత్వం కలిగి ఉండాలి.

సంప్రదించవలసిన నంబరు : 9948903517, 7702420777

లిఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు ఖచ్చితంగా మస్కులు ధరించాలి, సామాజిక దూరాన్ని పాటించాలి. కోవిడ్‌ నియమ నిబంధనలను పాటించని వారు అనుమతించబడరు.

ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ ఈనెల 11వ తేదీ శుక్రవారం.

సమయం – మధ్యాహ్నం 1:00 గంట నుండి సాయంత్రం 4 గంటల లోపు.

ఇంటర్వ్యూ నిర్వహించే స్థలం : 108 కార్యాలయం, జిల్లా గవర్నమెంట్‌ దవాఖాన, కామారెడ్డి.

పైన ఇవ్వబడిన ఉద్యోగమునకు సెలెక్ట్‌ ఐన ప్రతి ఒక్కరు హైదరాబాద్‌ నగరంలోి మాత్రమే విధులు నిర్వహించవలిసి ఉంటుంది, కావున హైదరాబాద్‌లో ఉద్యోగము చేయుటకు ఇంట్రెస్ట్‌ ఉన్నవారు మాత్రమే సెలక్షన్‌కు రాగలరు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article