కామారెడ్డి, సెప్టెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రైవేట్ టీచర్లను, లెక్చరర్లను ప్రభుత్వం ఆదుకోవాలని టిజివిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్మిర్ కార్ రామకష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా అనేక ప్రైవేట్ విద్యాసంస్థలల్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగులు వేతనాలు లేక సతమతమవున్న వారిని ఆదుకొని, ఎన్నో పోరాటాల కోర్చి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆకలి చావుని ఆపాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ టీచర్లకు, లెక్చరర్లకు ఆర్థికంగా నెలకు పక్క రాష్ట్రాల లాగా 5 వేల ఆర్థిక సహాయం చేసి వారి జీవనానికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు.
నాడు స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేస్తే నేడు ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగులను నిర్లక్ష్యం చేయకుండా వారికి ఆర్థిక భరోసా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రీకర్, గంగాధర్, కృష్ణ ప్రసాద్, పుల్కం రాజేష్ తదితరులు ఉన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021