Breaking News

22 నుంచి సెమిస్టర్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలోని బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ(ఎల్‌) కోర్సులకు ఈ నెల 15 వ తేదీ నుంచి ప్రారంభం కావలసిన చివరి (ఆరవ) సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలు మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్లకు చెందిన (2016 – 2017 బ్యాచ్‌ విద్యార్థులకు మాత్రమే) బ్యాక్‌ లాగ్‌ పరీక్షలను కొవిద్‌ – 19 నిబంధనలను అనుసరించి ఈ నెల 22 వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

పరీక్షలకు సంబంధించిన టైంటేబుల్‌ త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ విషయాన్ని డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించవలసిందిగా కోరారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ను దర్శించాలని ఆయన సూచించారు.

Check Also

ఒకరోజు గడువు పొడిగింపు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ మరియు ...

Comment on the article