Breaking News

జేసీఐ వారోత్సవాల సందర్భంగా రక్తదానం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జేసిఐ ఇందూర్‌ ఆద్వర్యంలో జేసీస్‌ వారోత్సవాల్లో భాగంగా శనివారం నిజామాబాదు రెడ్‌ క్రాస్‌ సొసైటీలో రక్తదాన శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసిఐ ఇందూర్‌ సభ్యులు రక్తదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రెడ్‌ క్రాస్‌ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానమని ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలన్నారు.

ప్రస్తుత కోవిడ్‌ సమయంలో రక్తదానానికి ప్రజలు ముందుకు రావడం లేదన్నారు. ఫలితంగా రక్తనిల్వలు తగ్గిపోయి రక్తం అవసరమయ్యే వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రక్తదానం చేస్తే రోగ నిరోధక శక్తి తగ్గుతుందనే అపోహతో రక్తదాతలు ముందుకు రావడం లేదని తెలిపారు.

రక్తదానంతో రోగనిరోధక శక్తి తగ్గుతుందనడంలో వాస్తవం లేదని ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జెసిఐ ఇందూర్‌ కార్యదర్శి తక్కూరి హన్మాండ్లు, పూర్వాద్యక్షులు బంగారి వీరబ్రహ్మం, చింతల గంగాదాస్‌, ప్రోగ్రామ్‌ చైర్మెన్‌ యాదేశ్‌ గౌడ్‌, ఉపాద్యక్షులు పెందోటి చంద్రశేఖర్‌, మైత్రి గంగాధర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

19న విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19వ తేదీ శనివారం నిజామాబాద్‌ నగరంలోని అన్ని ...

Comment on the article