Breaking News

పనులు వేగవంతంగా పూర్తిచేయాలి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బాన్సువాడ నియోజకవర్గం, నస్రుల్లాబాద్‌ మండలంలోని దుర్కి, మిరజాపుర్‌, నస్రుల్లాబాద్‌ మరియు బీర్కూర్‌ మండల కేంద్రంలోని క్లస్టర్‌ వారీగా రైతులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేలా నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణ పనులను, పల్లె ప్రకతి వనాలను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఆర్డీవో రాజా గౌడ్‌, భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని, నిర్మాణంలో నాణ్యత ఉండేలా చూసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మండలాల ఎంపీపీ పాల్తే విట్టల్‌, రఘు, పార్టీ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌ రెడ్డి, వీరేశం, జడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్‌, జణ్ణుభాయి ప్రతాప్‌, పాక్స్‌ చైర్మన్‌ కొల్లి గాంధీ, దివిటీ శ్రీనివాస్‌ యాదవ్‌, పెరిక శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ ద్రోణవెళ్లి అశోక్‌, జడ్పీ కోఆప్షన్‌ మజీద్‌, బాన్సువాడ మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు వ్యవసాయ, పంచాయత్‌ రాజ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలి

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మొస్రా మండల‌ కేంద్రంలో మండల‌ ప్రజాపరిషత్‌ సర్వసభ్య ...

Comment on the article