Breaking News

నూతన వేతన ఒప్పందాన్ని అమలు చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బీడీ యాజమాన్యాల అసోసియేషన్‌కు కార్మికుల వేతనాల పెంపుదలకు డిమాండ్‌ నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ పాత వేతనాల పెంపుదల ఒప్పందం మే 5వ తారీఖున అయిపోయిందని, మళ్లీ కొత్త వేతన ఒప్పందం ప్రకారం వేతనాలు పెంచాలని కానీ, యాజమాన్యాలు పెంచలేదన్నారు.

ఈ విషయమై గతంలో యూనియన్‌ తరపున డిమాండ్‌ నోటీసు ఇచ్చినా స్పందించకపోవడం సరైంది కాదన్నారు. వెంటనే కొత్త ఒప్పందాన్ని అమలు చేసి కార్మికులకు పెంపు ప్రయోజనం అందివ్వాలన్నారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో బీడీ కార్మికులకు యజమానులు వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.రాజన్న, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డీ.రాజేశ్వర్‌, ఎం.వెంకన్న, ముత్తన్న, సత్యక్క, మల్లేష్‌ సూర్యశివాజీ, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

19న విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19వ తేదీ శనివారం నిజామాబాద్‌ నగరంలోని అన్ని ...

Comment on the article