Breaking News

ఆరోగ్యం, స్వచ్ఛత కోసమే ఆ నిర్మాణాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల నగరంలోని గౌతమ్‌ నగర్‌ వాటర్‌ ట్యాంక్‌ వద్ద, జిజి కాలేజి గ్రౌండ్‌, అర్సపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్‌ జిమ్‌ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అర్సపల్లిలో మెటల్‌ రోడ్డు నిర్మాణం, పబ్లిక్‌ టాయిలెట్స్‌, దుబ్బ చౌరస్తాలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నిజామాబాద్‌ నగరంలోని పాలీటెక్నిక్‌ కళాశాల మరియు గంగస్థాన్‌ కాలనీల్లో ఒపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజల నుండి మంచి స్పందన రావడంతో శనివారం నగరంలో గౌతమ్‌ నగర్‌, అర్సపల్లి, జిజి కాలేజి గ్రౌండ్‌లో ఓపెన్‌ జిమ్‌ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. నగరంలోని మరిన్ని పార్కులలో, ఇతర ప్రదేశాలలో త్వరలోనే జిమ్‌ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

యువత తమ శరీరాన్ని పిట్‌గా ఉంచుకోవడంతో పాటు వివిధ పోటీ పరీక్షలకు పోటీపడే వారు జిమ్‌లను ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే నగర ప్రజల ఉపయోగార్థం అర్సపల్లి, దుబ్బ చౌరస్తాలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ని ప్రారంభించడం జరిగిందని, నిజామాబాద్‌ నగరం స్వచ్చంగా ఉండటం కోసం అన్ని ప్రాంతాలలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ నీతూ కిరణ్‌, కార్పొరేటర్లు మాయవర్‌ సవిత, ఏం.లావణ్య, ప్రవళిక, మునిసిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ వి పాటిల్‌, తెరాస నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Check Also

పనులు పెద్ద ఎత్తున చేపట్టాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా ...

Comment on the article