Breaking News

సభ్యత్వ బీమా చెక్కుల పంపిణీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 10 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 3 లక్షల 6 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి నియోజకవర్గంలో 489 మందికి 2 కోట్ల 96 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కాచబోయిన శ్రీనివాస్‌ రోడ్డు ప్రమాదంలో మతి చెందగా ఆయన భార్య స్వాతికి పార్టీ సభ్యత్వ బీమా నుండి మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article