Breaking News

గోసంగిలను ఎస్సి ఏ గ్రూప్‌లో చేర్చాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా గోసంగి సంఘం ఆధ్వర్యంలో జరగబోయే ఎస్సి వర్గీకరణపై స్థానిక న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీలోని గోసంగి సంఘ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు.

గతంలో ఎస్సి వర్గీకరణ జరిగినప్పుడు అత్యంత వెనకబడిన మాదిగ ఉపకులం గోసంగి కులస్తులను అభివద్ధి చెందిన మాల కులస్తులతో కలిపి ఎస్సి-సి గ్రూప్‌లో చేర్చడం జరిగిందని తద్వారా గోసంగి కులస్తులు మరింత వెనకబాటుకు గురయ్యారని జిల్లా గోసంగి సంఘం అధ్యక్షులు నిరుగొండ బుచ్చన్న ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపద్యంలో ఎస్సి వర్గీకరణ అంశం రాష్ట్రాలకే ప్రతిపాదించడంతో గతంలో వర్గీకరణలో అన్యాయానికి గురైన గోసంగిలను ఎస్సి-ఏ గ్రూప్‌లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

గోసంగి ఎస్సి వర్గీకరణ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమానికి రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంఘం అధ్యక్షులు గంధం రాజేష్‌, కొండపల్లి హనుమంతు, పతిరి గంగారాం, సర్పంచ్‌ కొండపల్లి పవన్‌, ఉప సర్పంచ్‌ స్వామి, కొండపల్లి సిద్దు, గంధం సాయిలు, సలహాదారులు గనిశెట్టి రాములు, గంధం పరశురాం తదితరులు పాల్గొన్నారు.

Check Also

19న విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19వ తేదీ శనివారం నిజామాబాద్‌ నగరంలోని అన్ని ...

Comment on the article