Breaking News

పలు డివిజన్‌లలో హరితహారం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాద్‌ నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ను అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తతో కలిసి నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ ప్రారంభించారు. అదేవిధంగా నూతనంగా మహిళలకు ప్రత్యేకంగా నిర్మించే ఓపెన్‌ జిమ్‌ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నగరంలోని 8, 9వ డివిజన్‌లోని లలిత నగర్‌, శ్రీ చక్ర అసోసియేషన్‌ వారి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు విక్రమ్‌ గౌడ్‌, సాయి వర్ధన్‌, నుడా డైరెక్టర్‌ అంబాదాస్‌ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article