Breaking News

డా.వి.త్రివేణికి కాళోజీ పురస్కారం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అద్యయనశాఖ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. వి. త్రివేణికి విమర్శా రంగంలో కాళోజీ పురస్కారం ప్రదానం చేశారు.

తెలంగాణ సాహిత్య కళాపీఠం, సాహిత్య, సాంస్క తిక, సామాజిక, సేవా సంస్థ వారు తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ నారాయణరావు జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని కాళోజీ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఆదివారం ఉదయం నిర్వహించిన జూం అంతర్జాల వేదిక మీద ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. ఆమె ఇదివరకు పుప్పొడి, పుత్తడి, బవంతి, బరంతి, పొత్తిలి, భాషిక, అలుగు వంటి సాహిత్య వ్యాస సంపుటాలను రచించి సాహితీ విమర్శలో కషి చేస్తున్నందుకు గాను ఆమెకు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు దాసరి శాంతాకుమారి తెలిపారు.

అవార్డు స్వీకరించిన త్రివేణి స్పందింస్తూ సాహిత్య విమర్శలో విస్తతంగా కషి చేయడానికి అవార్డు తనలో బాధ్యతను మరింత పెంచిందని సంతోషం వ్యక్తం చేశారు. అవార్డు గ్రహీత డా. వి. త్రివేణిని టీయూ వీసీ నీతూ కుమారి ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం, అధ్యాపకులు, అధ్యాపకేతరులు, పరిశోధకులు, విద్యార్థులు అభినందించారు.

Check Also

ఒకరోజు గడువు పొడిగింపు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ మరియు ...

Comment on the article