Breaking News

జాతీయ పండగలా నిర్వహించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని టిజివిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్మిర్‌ కార్‌ రామకష్ణ డిమాండ్‌ చేశారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ప్రభుత్వం సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్నీ అధికారికంగా జాతీయ పండగల లాగా ఆగస్ట్‌ 15, 26 జనవరిలాగా నిర్వహించాలన్నారు.

1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అధ్యక్షతన నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ స్వేచ్చ వాయువులు పీల్చుకుందన్నారు. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకల్లో ప్రభుత్వాలు అధికారికంగా స్వాతంత్ర సంబురాలు నిర్వహిస్తే స్వరాష్ట్రం కోసం పోరాడిన తెలంగాణ సంబురాలకు నోచుకోక పోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రాక ముందు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమాలు చేసిన విషయం విస్మరించి నియంత పాలన కొనసాగిస్తుందన్నారు. సమావేశంలో డివిజన్‌ నాయకులు భూపాల్‌, శ్రీకర్‌, కష్ణ ప్రసాద్‌, దీక్షిత్‌ రెడ్డి, నితిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article