Breaking News

15 నుంచి వ్యాధి టీకాల పంపిణీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొర్రెలు, మేకలు ఆరోగ్య పరిరక్షణ ముఖ్యమైనదని, గొర్రెలకు, మేకలకు ప్రబలే అంటూ వ్యాధులు పిపిఆర్‌ వ్యాధి వల్ల కలిగే మరణాలు తగ్గించి గొర్రెలు మేకల పెంపకం దారులకు లబ్ధి చేకుర్చుటకు తెలంగాణ రాష్ట్ర పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ ప్రతి ఏట పిపిఆర్‌ టీకాలు నిర్వహిస్తారని కామారెడ్డి జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

టీకాలు ముఖ్యంగా మందలో కొత్తగా చేరిన వాటికి మరియు ఈ సంవత్సరము పుట్టిన పిల్లలకు ప్రాధాన్యత టీకాలు ఇవ్వబడతాయన్నారు. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో కార్యక్రము ప్రతి మండలంలో ఈ నెల 15 నుంచి 26 వరకు సుమారు 2 లక్షల గొర్రెలు, మేకలకు పిపిఆర్‌ వ్యాధి టీకాలు వేసే లక్ష్యంతో చేపట్టబడుతుందన్నారు. కావున, గొర్రెలు, మేకల పెంపకందారులు, పశు వైద్య సిబ్బందికి సహకరించి పిపిఆర్‌ టీకాలు గొర్రెలు, మేక పిల్లలకు తప్పక వేయించాలని కోరారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article