Breaking News

15న కాగడాల ప్రదర్శన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విమోచనం పొందిన సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు కామారెడ్డిజిల్లా కేంద్రంలో సెప్టెంబర్‌ 15న కాగడాల ప్రదర్శన, మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బీజేపీ జిల్లా కార్యాలయం నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు నిర్వహించడం జరుగుతుందని బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంధర్‌ రెడ్డి తెలిపారు.

తెలంగాణ రాక ముందు విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేసిన ముఖ్యమంత్రి అధికారం చేపట్టాక మైనారిటీల ఓట్ల కోసం విమోచన దినాన్ని విస్మరించాడన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ బిజెవైఎం ఆధ్వర్యంలో నిర్వహించే కాగడాల ప్రదర్శన కార్యక్రమంలో తెలంగాణా వాదులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బిజెవైఎం కార్యకర్తలు, యువత అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article