Breaking News

గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీసన్‌లో అత్యధికంగా పండనున్న 7 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేసేలా మిల్లర్లు మరియు డీలర్లను రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అదే విధంగా రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి మరియు డిస్ట్రిక్ట్‌ మానేజర్‌, సివిల్‌ సప్లైస్‌లను ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి.

సోమవారం జిల్లాలోని వ్యవసాయ, సివిల్‌ సప్లైస్‌, కో-ఆపేరటివ్‌ తదితర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్‌ సీసన్‌లో జిల్లాలో అత్యధికంగా సన్నరకం వరి ధాన్యం దాదాపు ఏడు లక్షల మెట్రిక్‌ టన్నులు రానున్నదని, సన్న రకం వరి పండించిన రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాల్సిన బాధ్యత మనపైన ఉందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మిల్లర్లు, డీలర్లకు సమాచారం అందించి జిల్లా రైతులు పండించిన సన్నరకం వరిని మంచి ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

అలాగే దొడ్డు రకాలు 2 లక్షల 57 వేల మెట్రిక్‌ టన్నులు రానున్నదని, జిల్లాలో ముందుగా బోధన్‌ మరియు నందిపేటలో సెప్టెంబర్‌ చివరి వరకు వస్తుందని, ఒక ప్లాన్‌ ప్రకారం పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు మంచి రేట్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్‌, పీడీ, మెప్మా రాములు, జిల్లా కో-ఆపరేటివ్‌ అధికారి సింహాచలం, జిల్లా సివిల్‌ సప్లయ్‌, మార్కెటింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పంట వ్యర్థాలను మొక్కలకు దూరంగా అంటించండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లకు ఇరువైపుల దగ్గరగా ఉన్న పొలాల రైతులు పొలం ...

Comment on the article