Breaking News

గడువు అక్టోబర్‌ 30కి పెంచారు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ శాఖ, ఐ.టి శాఖ మాత్యులు కెటిఆర్‌ నిర్వహించిన మున్సిపల్‌ మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సులో నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ పాల్గొన్నారు. సోమవారం మేయర్లు, కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు సమావేశంలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్టం స్వచ్ఛ నిర్వహణలో ముందు భాగంలో ఉండటానికి తీసుకోవలసిన చర్యల గురించి ఆదేశాలిచ్చారు.

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి నాటికి రాష్ట్రంలో అన్ని మున్సిపల్‌ కార్పోరేషన్లలో, మున్సిపాలిటీలలో చెత్త నిర్వహణ, చెత్త సేకరణ, డ్రై రిసోర్స్‌ సెంటర్‌, కంపోస్ట్‌ మెనేజ్మెంట్‌, పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం, ఇంటింటికి టాయిలెట్‌ ఉండే విధంగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు.

వన్‌ టైం టాక్స్‌ సెటిల్మెంట్‌ గడువును అక్టోబర్‌ 30 నాటికి పెంచినట్టు తెలిపారు. సమీక్ష సమావేశంలో స్వచ్ఛసర్వేక్షన్‌ నాటికి అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌.వి.పాటిల్‌, పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది, మున్సిపల్‌ ఇంజినీర్‌ సిబ్బంది, శానిటేషన్‌ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article