Breaking News

వాటి వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని జెసిఐ ఇందూర్‌ కార్యదర్శి తక్కూరి హన్మాండ్లు ఉద్బోదించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. జేసీస్‌ వారోత్సవాల్లో భాగంగా జేసిఐ ఇందూర్‌ ఆద్వర్యంలో సోమవారం వెల్త్‌ అవుటాప్‌ ద వేస్ట్‌ కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో భాగంగా నిజామాబాదు నగరంలోని పలు ప్రాంతాల్లో వీధి వ్యాపారులు, ప్రజలకు బట్ట సంచులు, కాగితపు కవర్లు పంపిణీ చేశారు. అనంతరం జెసిఐ ఇందూర్‌ కార్యదర్శి హన్మాండ్లు మాట్లాడుతూ జేసిఐ ఆద్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

అందులో భాగంగా మొక్కలు నాటడం, ప్లాస్టిక్‌ నిషేధ అవగాహన సదస్సులు, బట్ట సంచులు, కాగితపు కవర్లు, మొక్కల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో జేసిఐ ఇందూర్‌ పూర్వాద్యక్షులు చింతల గంగాదాస్‌, కోశాధికారి డాక్టర్‌ జమాల్‌పూర్‌ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article