Breaking News

పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో వివిధ డివిజన్లలో అభివద్ధి పనులను నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ భూమిపూజ చేసి ప్రారంభించారు. మంగళవారం నగరంలోని 52, 51, 57, 31 డివిజన్లలో సీసీ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను సుమారు 40 లక్షల నిధులతో అభివద్ధి పనులకు డిప్యూటి మేయర్‌ ఇద్రిస్‌ ఖాన్‌ స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు.

నగర అభివద్ధిలో భాగంగా ప్రతి రోజు డివిజన్లలో పనులను ప్రారంభిస్తున్నామని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే అత్యవసరమైన పనులను చేయిస్తున్నామని పూర్తి నాణ్యతతో పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు అఫ్సర్‌, అబ్దుల్‌ అలీ, సీమ నస్రీన్‌, రజియా సుల్తానా, మున్సిపల్‌ డి.ఇ. ముస్తాక్‌ అహ్మద్‌, ఏ.ఇ. ఇనాయత్‌ కరీం, ఇంచార్జ్‌ సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీకాంత్‌ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article