Breaking News

పరీక్ష ఫీజు గడువు పొడగింపు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మొదటి, రెండవ మరియు మూడవ సంవత్సరం బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 21 వరకు ఎలాంటి అదనపు ఫీజు లేకుండా పొడిగింపబడిందని పరీక్షల నియంత్రణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

100 రూపాయల ఆలస్యపు రుసుముతో ఈ నెల 24 వరకు చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. కొవిద్‌ – 19 నిబంధనల కారణంగా విద్యార్థుల సానుకూలతను అనుసరించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విషయాన్ని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్‌, విద్యార్థులు గమనించాలని కోరారు. పుర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ సంప్రదించాలని సూచించారు.

Check Also

22 నుంచి సెమిస్టర్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలోని బిఏ, ...

Comment on the article