Breaking News

ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో ఇచ్చిన టార్గెట్‌ పూర్తి కావాలని, పెట్టిన ప్రతి మొక్క బ్రతుకాలని లేని పక్షంలో బాధ్యులపై వారి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం ఎంపిడివోలు, ఎపిఓలు, మున్సిపల్‌ కమిషనర్‌లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే సంవత్సరానికి మొక్కలు డిమాండ్‌ ఎంత ఉన్నది, మున్సిపాలిటీలో వార్డ్‌కు ఒక్క నర్సరీ ఉండాలని, దానికి గేట్‌, వాటర్‌, బోర్‌ అన్ని ఉండాలని, మున్సిపాలిటీలో, ప్రతి గ్రామంలో ఇంటికి ఎన్ని మొక్కలు కావాలో ముందుగా గుర్తించాలని, ప్రతి నర్సరీలో 25 వేల మొక్కలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

పల్లె ప్రగతి వనంలో ఒక్క ఎకరంలో 4 వేల మొక్కలు, సగం ఎకరం ఉంటే 2 వేల మొక్కలు పెట్టాలని, అదేవిధంగా పల్లె ప్రకతి వనం, క్రిమటోరియం, ఆవెన్యూ ప్లాంటేషన్‌లో తప్పకుండా మొక్కలు పెట్టాలని, పెట్టిన ప్రతి మొక్క బ్రతకాలని, ప్రతి మొక్కను తనిఖీ చేయడం జరుగుతుందని, రోడ్డు పక్కన ప్రతి 5 మీటర్‌ లకు ఒక్క మొక్క పెట్టాలని, అన్ని గ్రామ పంచాయతీలలో బుషెస్‌ క్లీన్‌ చేయాలని, అప్పుడే మొక్కలు తొందరగా పెరుగుతాయని, మొక్క చనిపోతే వెంటనే వేరే మొక్క పెట్టాలని, ప్రతి జిపిలో ఏడుగురు వన సేవకులు పనిచేసేలా చూడాలన్నారు.

మిగితా జిల్లాలలో 80 శాతం నాటిన మొక్కలు అప్‌లోడ్‌ చేసారని, మన జిల్లాలో 57 శాతం మాత్రమే చేశారని, వారంలో 80 నుండి 90 శాతం పూర్తి చేయాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని, ప్రతి ఇల్లిగల్‌ ప్లాట్స్‌, లేఔట్స్‌కు వార్డ్‌ వారీగా రిజిస్టర్‌ మరియు ఒక ఆఫీసర్‌ను వార్డ్‌ వారీగా పెట్టాలని, ప్రజలకు అవగాహన కొరకు చాటింపు చేయాలని, కరపత్రాలు ప్రింట్‌ చేసి పంచాలని, డివిజన్‌లో ఆర్డీవోలు, మున్సిపాలిటీలలో కమీషనర్లు బాధ్యత తీసుకోవాలని, రెవెన్యూ చట్టం వచ్చే లోపు రైతు వేదికలు, పల్లె ప్రకతి వనాలు పూర్తి చేయాలన్నారు.

గ్రామంలో ప్రతి రోజు శానిటేషన్‌ చేయాలని, తడి చెత్త, పొడి చెత్త కొరకు ఒక యాప్‌ తయారవుతున్నదన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ గోవింద్‌ నాయక్‌, నిజామాబాద్‌ మునిసిపల్‌ కమీషనర్‌ జితేష్‌ వి పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article