Breaking News

అకృత్యాలకు పాల్పడడంతో తిరుగుబాటు చేశారు

బోధన్‌, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 1948 సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రజలకు విద్రోహ దినమని సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ పట్టణంలో జరిగిన సమావేశంలో పార్టీ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి బి.మల్లేష్‌ అన్నారు.

నైజాం రజాకార్ల పాలనలో ఇక్కడి ప్రజలు అణచివేత, పీడన, వివక్షతలను ఎదుర్కొన్నారని, నైజాంతో పాటు దేశ్‌ ముఖ్‌లు, భూస్వాములు, వారి గుండాలు ప్రజలపై దాడులకు పాల్పడే వారని, విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి పేద ప్రజల భూములను, పంటలను స్వాదీనం చేసుకోవడం ఎవరైనా ప్రశ్నిస్తే, చంపడం లాంటివి అనేక అకత్యాలకు పాల్పడ్డారని, దీంతో ప్రజలు కమ్యునిస్టుల ఆధ్వర్యంలో తిరుగు బాటు చేశారని, మౌలిక మార్పు కోసం విరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 6 సంవత్సరాలు కమ్యునిస్టుల నాయకత్వాన కొనసాగిందన్నారు.

పోరాట పలితంగా 3 వేల గ్రామాల్లో ప్రజల రాజ్యాధికారాన్ని నెలకొల్పారని, 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలు పంచుకొన్నారని, వెట్టి చాకిరీని రద్దు చేసుకొన్నారని అనేక సాంఘిక మార్పులను పొందారని, ఇది ఇలాగే కొనసాగితే దేశం మొత్తం దేశ్‌ముఖ్‌ల, భూస్వాముల భూములను పేద ప్రజలు కమ్యునిస్టుల నాయకత్వంలో స్వాదీనం చేసుకుంటారని భయపడి నిజాంతో రహస్య ఒప్పందం చేసుకొని, డిల్లీ నుంచి యూనియన్‌ సైన్యం వచ్చి నైజాం సంస్థానంపై దాడి (ఆపరేషన్‌ పొలో) చేసి నవాబు ప్రభుత్వాన్ని కూల దోసినట్లు ఒక డ్రామా ఆడారన్నారు.

అందుకే ఇది తెలంగాణ ప్రజలకు విద్రోహమని వివరించారు. సమావేశంలో సుల్తాన్‌ సాయులు, పడాల శంకర్‌, బి.నాగమణి, బి.సాయులు, హెచ్‌.నాగేష్‌, సిహెచ్‌.గంగయ్య, చాంద్‌, కష్ణ, కె.రవి, వైద్యనాత్‌, డి.యాదవ్‌, ఎ.శ్రీను, పద్మ, ఎం.శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కొత్త చట్టం ప్రకారం ఇద్దరిపై చర్యలు

బోధన్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో చేపట్టే పనులు పంచాయతీ సెక్రెటరీల‌ ఆధ్వర్యంలోనే జరగాల‌ని, ...

Comment on the article