Breaking News

సెయింట్‌ థెరిసా హై స్కూల్‌ సీజ్‌ చేశారు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలోగల సెయింట్‌ థెరిసా హైస్కూల్‌ను సీజ్‌ చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి తమ పిల్లలను పాఠశాలలో చేర్పించరాదన్నారు. పాఠశాల వారు నారాయణ ఈ టెక్నో స్కూల్‌ పేరిట అడ్మిషన్లు తీసుకుంటున్నారని, కానీ నారాయణ పాఠశాలల యాజమాన్యం నిజామాబాద్‌ జిల్లాలో ఎటువంటి ప్రభుత్వ అనుమతి, గుర్తింపు గల పాఠశాలలు లేవని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు గమనించి ఎవరైనా పాఠశాలలో జాయిన్‌ చేసినట్లయితే వారే బాధ్యత వహించాలన్నారు.

విద్యార్థుల విషయంలో అధికారులతో పాటు తల్లిదండ్రులకు సమాన బాధ్యతలు ఉన్నవని, కనుక వారి పిల్లలను అనుమతి, గుర్తింపు గల పాఠశాలల్లో మాత్రమే చేర్పించాలని సూచించారు. ఈ విషయంలో సంబంధిత మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలన్నారు.

Check Also

పనులు పెద్ద ఎత్తున చేపట్టాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా ...

Comment on the article